గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు దారుణ అవమానం.. వీడియో ఇదిగో!

  • గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన శునకం
  • దానిని చూస్తూ ‘హార్దిక్.. హార్దిక్’ అని ప్రేక్షకుల అరుపులు
  • గుజరాత్ ఫ్యాన్స్‌పై మండిపడుతున్న నెటిజన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌ (ఐపీఎల్)లో భాగంగా గతరాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై సారథి హార్ధిక్ పాండ్యాకు దారుణ అవమానం జరిగింది. రోహిత్ స్థానంలో పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు.. పాండ్యా కనిపించిన ప్రతిసారి కించపరిచేలా ప్రవర్తించారు. మ్యాచ్ జరుగుతుండగా ఒకానొక సమయంలో ఓ శునకం మైదానంలోకి దూసుకొచ్చి పరుగులు తీసింది. శునకాన్ని చూస్తూ ప్రేక్షకులు ‘హార్దిక్.. హార్దిక్’ అని పెద్దగా అరుస్తూ పాండ్యాను అవమానపరిచేలా ప్రవర్తించారు. 

వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. హార్దిక్ చేసిన నేరమేంటని ప్రశ్నిస్తున్నారు. అహ్మదాబాద్ అభిమానులకు ఏమైందని నిలదీస్తున్నారు. పాండ్యాను శునకంతో ఎందుకు పోల్చుతున్నారని మండిపడుతున్నారు. వారి ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో జీర్ణించుకోలేక గుజరాత్ ఫ్యాన్స్ ఇలాంటి నీచానికి దిగజారారని విమర్శిస్తున్నారు. అసలు పాండ్యాను వ్యతిరేకించడానికి గల ఒక్క కారణమైనా చెప్పగలరా? అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Viral Video
Hardik Pandya
Gujarat Titans
Mumbai Indians
IPL 2024

More Telugu News